బర్త్ డే పిక్ : విన్నర్

Posted October 15, 2016

  sai dharam tej new movie vinner

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విన్నర్’. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తేజు సరసన రకుల్ ప్రీత్ సింగ్
జతకట్టనుంది. ఈరోజు (అక్టోబర్ 15) సాయి ధ‌ర‌మ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసి విషెస్ తెలియ‌జేసింది. ‘విన్నర్’ ఫస్ట్ లుక్ చాలా క్లాస్ గా ఉంది. ఇన్నాళ్లు మాస్ లుక్ లతో కనిపించిన తేజు.. ఈ లుక్ తో ఆకట్టుకొంటున్నారు. ఈ పిక్ లో తేజు లుక్స్ మహేష్ బాబు లుక్స్ ని తలపించేలా ఉంది.

మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజు టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్నాడు. మాస్ మహారాజ రవితేజని రిప్లేస్ చేసేలా
కనిపిస్తున్నాడు. ఇప్పటికే పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలని తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇటీవలే ‘తిక్క’తో లెక్క తప్పిన మల్లీ ‘విన్నర్’తో హిట్ ట్రాక్ లోకి రావాలని ఆశపడుతున్నారు. ‘విన్నర్’తో పాటు.. మరిన్ని విజయాలతో టాలీవుడ్ టాప్ స్టార్ గా తేజు ఎదిగాలని ఆశిస్తూ.. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

[wpdevart_youtube]mvCLBtz6fXY[/wpdevart_youtube]

SHARE