Posted [relativedate]
అభిమానులని చెప్పుకుంటూ హీరోల మధ్య అడ్డుగోడలు కట్టేవారికి ఇది చెంపపెట్టులాంటి వార్త. కులాల కన్నా హీరోల కన్నా సినిమా గొప్పదనుకునే వారికి స్వీట్ న్యూస్.గౌతమి పుత్ర శాతకర్ణి కి మొదటి షో నుంచే తిరుగులేని టాక్ రావడం చూసి చిత్ర సీమంతా పండగ చేసుకుంటోంది.మెగా క్యాంపు కి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా చొరవగా గౌతమి పుత్ర శాతకర్ణి గురించి గొప్ప రిపోర్ట్స్ వస్తున్నాయంటూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.నట సింహం బాలయ్యని ఉద్దేశించి మీరు మాలాంటి చాలా మందికి స్ఫూర్తి అని ట్వీట్ చేశాడు.చిత్ర పరిశ్రమని గ్రూపులుగా,కులాల వారీగా చూస్తున్న చాలా మందికి ఈ కుర్ర హీరో తన మాటలు,చేతలతో మంచి సందేశం పంపాడు.ఇప్పుడైనా ఆ ఒరవడిలో కొట్టుకుపోతున్న వాళ్ళు కళ్ళు తెరిస్తే మేలు ..
Hearing great reports about #GPSK congratulations to the whole team and @DirKrish, #NBK garu you are an inspiration to many of us