నీహాతో నాకు పెళ్లేంటి? సాయి ధరమ్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు

142

 Posted May 9, 2017, 1:28 pm at 13:28

saidharam tej and niha wedding rumors
మెగా ఫ్యామిలీలో త్వరలో వివాహం జరగబోతుందని, అది మరెవ్వరిదో కాదు నాగబాబు కూతురు నీహారికకు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో ప్రచారం జరిగింది. మెగా వర్గాల నుండి ఈ విషయం అధికారికంగా ప్రకటన వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ మెగా సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రకటించాడు.

పెళ్లి వార్తలపై నిహారిక మౌనంగా ఉండగా, సాయిధరమ్‌ తేజ్‌ స్పందిస్తూ ఆ వార్తలన్ని పుకార్లే అంటూ కొట్టి పడేశాడు. ఒకే కుటుంబంకు చెందిన వారు కలివిడిగా ఉంటే పెళ్లి అంటూ ప్రచారం చేస్తారా అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారిక తనకు చెల్లితో సమానం అని, ఆమెతో పెళ్లి  గురించి తాను ఎప్పుడు కూడా ఆలోచించలేదు అంటూ సాయి చెప్పుకొచ్చాడు. వరుసకు మరదలు అయినంత మాత్రాన ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ఎలా అనుకుంటారు అంటూ సాయి మీడియాను ప్రశ్నించాడు. సాయి ప్రకటనతో మీడియాలో గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here