సాక్షి కి వరాల వెల్లువ ….

 sakshi achieved medal got giftsరియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన రెజ్లర్‌ సాక్షి మాలిక్‌కు హర్యానా ప్రభుత్వం రూ. 3 కోట్ల నజరానా ప్రకటించింది. భారత్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో ఆమె స్వస్థలం హర్యాణలోని రోహ్‌తక్‌లో కుటుంబ సభ్యులు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి. రెజ్లింగ్‌లో తొలి పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా సాక్షి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో క్రీడాకారిణిగా సాక్షి మాలిక్‌ నిలిచింది. 2014 కామన్వెల్త్‌ పోటీల్లో సాక్షి రజతం సాధించింది.

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిపెట్టిన సాక్షి మాలిక్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత క్రీడాకారులకు సాక్షి మాలిక్ మార్గదర్శకురాలిగా నిలిచిందని ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా మాలిక్ ను అభినందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. భవిష్యత్తు తరాల క్రీడాకారులకు సాక్షి మాలిక్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సాక్షి కాంస్య పతకం సాధించడం యావత్‌ భారతదేశంను గర్వపడేలా చేసిందన్నారు. సాక్షి మాలిక్‌ మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.

సాక్షికి హర్యాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆమెకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల నగదు, ఇంటి స్థలం ఇవ్వనుంది. సాక్షి రైల్వే ఉద్యోగిని కావడంతో ఆమెకు యాభై లక్షల బహుమతిని రైల్వే ప్రకటించింది. ఇండియన్ ఒలింపిక్స్ ఆసోసియేషన్ కుడా 20 లక్షల బహుమతిని సాక్షికి ఇవ్వనుంది.

SHARE