సాక్షికి సాధ్యం ..భారత్ కి పతకం….

 sakshi achieved medal rio olympics రియో  ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్  బోణీ కొట్టింది.  రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించి భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది.

హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా సాక్షి మాలిక్ నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ(2000, సిడ్నీ), బాక్సర్ మేరీకోమ్(2012, లండన్), షటర్ల్ సైనా నెహ్వాల్(2012, లండన్).మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో  సాక్షి మాలిక్ పతకాల ఖాతాను తెరించింది. కర్జిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను ఓడించి.. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

ఒలింపిక్స్ లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో… మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-3తో వెనుకంజలో నిలించింది. సెకండ్ ఆఫ్ లో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత చివరి 20 సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి 7-5తో విజయపతాకాన్ని ఎగురవేసింది.

SHARE