అమ్మో… ఆమూడు పత్రికలది ఒకటే మాట ..

  sakshi eenadu andhrajyothi papers same word     

  ఈనాడు,ఆంధ్రజ్యోతి,సాక్షి..ఈ మూడు పత్రికలు ఒకవార్త గురించి ఒకేరకమైన రిపోర్టింగ్ చేయడం ఎప్పుడైనా చూశామా? కానీ ఇవాళ ఆ అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది…అదికూడా ఆషామాషీ వార్త కాదు. చంద్రబాబు చైనా టూర్ లో జరిగిన ఒక ఒప్పందం మీద ఈ మూడు పత్రికలు ఒకే స్థాయి ప్రాధాన్యం ఇచ్చాయి .అదే దొనకొండలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు మీద CASME తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 43,120 కోట్లతో దొనకొండ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తారు…

సహజంగానే చంద్రబాబు టూర్ కావడంతో ఈనాడు,ఆంధ్రజ్యోతి బాగానే ప్రాధాన్యం ఇస్తాయి. మరి సాక్షి కూడా అదే ఉత్సాహం చూపించడమే ఇక్కడ చిత్రాతి చిత్రం. దొనకొండ పారిశ్రామిక పార్క్ వార్త సాక్షిలో కవరేజ్ బాగానే రావడంతో పచ్చ తమ్ముళ్ల బుర్రలు ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయాయి. జగన్ గెలిస్తే దొనకొండే రాజధాని అవుతుందని ysrcp నేతలు అక్కడ భారీగా భూములు కొన్నట్టు చేసిన ఆరోపణలు గుర్తుకొచ్చాయి. అయినా సరే అక్కడే పారిశ్రామిక పార్క్ ఏర్పాటవుతోంది…జగన్ అండ్ కో కు చంద్రబాబు మేలు చేస్తారా? ఏమో అంతా అయోమయం ..ఈ రాజకీయం…….

Leave a Reply