జగన్ సెటిల్మెంట్ హైదరాబాద్ లో?

0
355
sakshi epaper wrote story about on andhra pradesh telangana water distribution

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sakshi epaper wrote story about on andhra pradesh telangana water distribution
ఆంధ్రప్రదేశ్ అధికార పగ్గాలు కావాలి తప్ప అక్కడ వుండాలని వైసీపీ అధినేత జగన్ కి ఏ కోశానా లేదని టీడీపీ నాయకులు విమర్శింస్తుంటారు.వాటిని నిజం చేస్తూ ఇప్పటికీ ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి రాలేదు.ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈసారి విజయవాడలో పార్టీ ప్లీనరీ జరిపిస్తున్నారు.కానీ ఆయన కనుసన్నల్లో నడుస్తున్న సాక్షి పేపర్ లో ఓ కీలక వార్త శీర్షిక చూస్తే ఆయన వైఖరి తేటతెల్లమవుతుంది.ఆయన హైదరాబాద్ లో సెటిల్ అవుతారని చెప్పేందుకు ఈ ఒక్క విషయం తో తేలిపోతుంది.

నాగార్జున సాగర్,శ్రీశైలం కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటిపంపకాలు జరిగిన విషయం తెలిసిందే.8 టీఎంసీల నీటిలో ఏపీ కి 6 .5 టీఎంసీలు,తెలంగాణాకి 1 .5 టీఎంసీల నీటిని కృష్ణా వాటర్ బోర్డు కేటాయించింది.అయితే ఈ వార్తని సాక్షి ఏపీ ఎడిషన్ లో ఏపీ కి 6 .5 ,తెలంగాణ కి 1 .5 అని హెడ్డింగ్ పెట్టింది.ఇక తెలంగాణ ఎడిషన్ కి వచ్చేసరికి మనకు 1 .5 ,ఆంధ్రప్రదేశ్ కి 6 .5 అనే శీర్షిక పెట్టింది.మన అనే మాట రెండు వేర్వేరు ఎడిషన్స్ కి వాడి ఉంటే ఇది ఆయా ప్రాంతాలకు తగ్గట్టు వార్తలు రాశారు అనుకోవచ్చు.కానీ తెలంగాణ కి మాత్రమే ఆ మాట ఉపయోగించడం ఆంధ్రాలో అధికారం కోరుకునే పార్టీ తరపున పని చేసే పత్రికకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.ఇలాంటి చిన్నచిన్న విషయాలకి జగన్ ని ముగ్గులోకి లాగడమా అనుకోవచ్చు.కానీ పత్రికల్లో పైన చెప్పినట్టు కింద నడుస్తుందని వేరే చెప్పాలా?

Leave a Reply