అమ్మాయిల కోసం సాక్షి..

   sakshi malik brand ambassadorఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ను ఘనంగా సత్కరించింది హర్యానా ప్రభుత్వం. బహదూర్ ఘర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సాక్షిని సన్మానించారు. భేటీ బచావో.. భేటీ పడావో.. కార్యక్రమానికి సాక్షిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. సాక్షి స్వగ్రామంలో స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండున్నర కోట్ల రూపాయల చెక్కును సాక్షికి అందించారు. అంతకు ముందు మాట్లాడిన సాక్షి.. రాష్ట్ర ప్రభుత్వం తనను సత్కరించడం సంతోషంగా ఉందని… ఇలాగే ప్రోత్సాహం అందిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తానని  చెప్పింది.

SHARE