సాక్ష్యమెక్కడ ‘సాక్షి’?

0
869

  sakshi news fault newsవెలగపూడి తాత్కాలిక సచివాలయ నిర్మాణం కుంగి పోయిందంటూ ఊదరగొట్టిన సాక్షి కి సాక్ష్యం దొరకలేదా.? ఇప్పటికే మున్సిపల్ శాఖ  మంత్రి నారాయణ ఆ పత్రికను ఏకిపారేశారు. అది మీకోరిక మాత్రమే అని,ఎన్నటికీ తీరదని  కూడా చెప్పేశారు. సరే రాజకీయ విమర్శలు సహజమనుకుంటూ ‘సాక్షి’ పత్రిక తిరగేసిన గుంటూరు వాసులకు నిజంగానే షాక్ తగిలింది. గుంటూరు నుంచి వస్తున్న మెయిన్ ఎడిషన్ లో ఆ వార్త ఎక్కడా కన్పించలేదు.

అనుబంధ పత్రికలో మాత్రం ‘సచివాలయంలో కలకలం’ అంటూ హెడ్డింగ్ పెట్టి.. వార్త మెయిన్ పేజీలో చదువుకోమని రాశారు.. సరేకదాని సాక్షిని ఆసాంతం తిరగేసినా ఆ వార్త మాత్రం కనపడలేదు.. ఏంటిది ‘సాక్షి’? ఇలాగైతే ఎలా.? సర్కార్ వ్యతిరేక వార్తలకు మిమ్మల్నే నమ్ముకుంటే .. మీరు కూడా ఇలా చేస్తే ఎలా..? సమస్య సాంకేతికం కూడా  అయ్యుండొచ్చు .. కానీ విషయం మాత్రం చిన్నది కాదుగా..

Leave a Reply