ఒకే తీర్పు ..రెండు భాష్యాలు చెప్తున్న సాక్షి,జ్యోతి

  sakshi news paper andhrajyothi news paper vote-for-cash case differen typesఓటుకునోటు కేసులో సుప్రీమ్ కోర్ట్ తాజాగా ఉత్తర్వులిచ్చింది.ఈ కేసులో ఇచ్చిన ఉత్తర్వులపై సాక్షి,ఆంధ్రజ్యోతి చెరో రకంగా భాష్యం చెప్పడంతో ఏది నిజమో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.ఈ కేసులో సీఎం చంద్రబాబుని విచారించాలంటూ వైసీపీ కి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తొలుత ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు.ఆడియో టేపులకి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక బాబు గొంతేనని తేల్చినా ఆయనపై చురుగ్గా విచారణ జరపడంలేదని కోర్టుకి తెలిపారు.ఆ వాదనతో ఏకీభవించిన కోర్ట్ విచారణకు ఆదేశించింది.అయితే చంద్రబాబు హోకోర్టు ని ఆశ్రయించడంతో ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే వచ్చింది.ఆ స్టే ను సవాల్ చేస్తూ ఆళ్ళ సుప్రీమ్ కోర్ట్ గడప తొక్కారు.

అయితే సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు చంద్రబాబుకి ఎదురుదెబ్బని సాక్షి..ఆళ్ళ కి చుక్కెదురని ఆంధ్రజ్యోతి రాశాయి.బాబు క్వాష్ పిటీషన్ పై నాలుగు వారాల్లో నిర్ణయం  తీసుకోవాలని హైకోర్టుకి సుప్రీం సూచించినట్టు సాక్షి తెలిపింది.ఆలోగా హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ తమ వద్దకు రమ్మని సుప్రీమ్ సూచించినట్టు సాక్షి వివరించింది.

    ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వైసీపీ దిమ్మతిరిగేలా సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించిందని రిపోర్ట్ చేసింది.బాబుని విచారించాలన్న ఆళ్ళ పిటీషన్ ని సుప్రీమ్ తిరస్కరించినట్టు తెలిపింది.హైకోర్టు పరిధిలో ఉన్న అంశంపై జోక్యానికి సుప్రీమ్ కోర్ట్ నిరాకరించినట్టు జ్యోతి కధనం .ఈ రెండు పత్రికలూ చెరో వాదన చేయడంతో అసలు విషయం తెలుసుకోడానికి జాతీయ పత్రికల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.తెలుగు రాష్ట్రాల్లో మీడియా వైఖరి తెలుసుకోడానికి ఇది మరో ఉదాహరణ.

SHARE