100 ఎకరాల్లో సల్మాన్ ఇల్లు

114

Posted July 15, 2016, 7:47 am

salman home 100 acres
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త ఇల్లు కట్టుకోబోతున్నాడు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సల్మాన్.. హాలిడేస్ గడిపేందుకు ప్రత్యేక ఇంటిని, ఎస్టేట్ ని సిద్ధం చేసుకుంటున్నాడు. మహారాష్ట్రలోని గొరాయ్ బీచ్ దగ్గర్లో సల్మాన్ ఐదు బెట్ రూమ్ ల బంగ్లా కట్టించుకుంటున్నాడు. తన 51వ పుట్టినరోజు నాటికి గృప్రవేశం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. వంద ఎకరాల ఎస్టేట్ లో నిర్మిస్తున్న ఇంటిని, ఎస్టేట్ ను స్వయంగా సల్మానే డిజైన్ చేసుకుంటున్నాడు.

వంద ఎకరాల స్థలం మధ్యలో ఇల్లు.. ఇంటికి వెనకభాగంలో డర్ట్ బైకింగ్ ఎరీనా, ముందుభాగంలో అందమైన మొక్కలు, తోటలు పెంచనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇదే ఎస్టేట్ లో తన కుటుంబ సభ్యులు, అతిథుల కోసం సపరేట్ గా ఇళ్లు కట్టిస్తున్నాడు. అంతేకాదు మహారాష్ట్రకు ఈశాన్య ప్రాంతంలో ఫామ్ హౌస్ లు కట్టించుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇటీవల వరుస హిట్లతో జోరుమీదున్న సల్మాన్.. అందుకు తగ్గట్లే భారీగా సంపాదిస్తున్నాడు. ఆ మనీతోనే ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్. సల్మాన్ హాలిడే హోమ్, ఫామ్ హౌస్ ల నిర్మాణంపై బాలీవుడ్ సెలబ్రెటీలు ఆశక్తి చూపిస్తు్నారు. అంతేకాదు మహారాష్ట్ర కోస్టల్ ఏరియాలో ఉండే సాల్సెట్టే, భెట్ ఐలాండ్స్ లో బంగ్లాలు కట్టించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here