నాకే పాపం తెలియదు: సల్మాన్

0
473
Salman Khan attend in arms act case in jodhpur court

Posted [relativedate]

Salman Khan attend in arms act case in jodhpur court
1998లో సల్మాన్ ఖాన్, సైఫ్‌ అలీ ఖాన్‌,సోనాలిబింద్రే,టబులు కలిసి నటించిన హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా గుర్తుంది కదూ.ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ ఖాన్‌.. అతని స్నేహితులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదయ్యిందన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు సల్మాన్‌ పై అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న మరో కేసు కూడా నమోదయ్యింది.

19ఏళ్ళ నాటి ఈ కేసులో సల్మాన్‌ ఈరోజు వాంగ్మూలం ఇచ్చేందుకు జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరయ్యాడు. నేరానికి ప్రోత్సాహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సినిమాలో సహనటులు కూడా సల్మాన్ తో పాటు కోర్టుకు హాజరయ్యారు.అసలు తాను నిర్దోషినని,తనమీద తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ పేర్కొన్నాడు. అసలు తాను వేటకే వెళ్లలేదని, భద్రతా కారణాల వల్ల షూటింగ్‌ తర్వాత హోటల్‌ కే వచ్చి విశ్రాంతి తీసుకున్నానని కోర్టుకు వివరించాడు. అటవీ శాఖ అధికారులు కుమ్మక్కై పబ్లిసిటీ కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ ఆరోపించాడు.

Leave a Reply