ఇది నిజమైతే మెగా బ్లాక్‌బస్టర్‌ ఖాయం

0
519
salman khan in chiru uyyalawada narasimha reddy movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

salman khan in chiru uyyalawada narasimha reddy movie
మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. చిరు రీ ఎంట్రీ 150వ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు 151వ సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాను భారీగా తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సాయంతో రామ్‌ చరణ్‌ ఈ సినిమాను 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ మొత్తం బడ్జెట్‌ 150 కోట్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత భారీ బడ్జెట్‌ అన్నప్పుడు తప్పకుండా ఏదైనా ప్రత్యేకత ఉండాలి. లేదంటే సినిమా బడ్జెట్‌ను రికవరీ చేయడం కష్టం.

భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ఒక పాత్ర చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 5 నుండి 15 నిమిషాల పాటు ఆయన పాత్ర ఉండే అవకాశం ఉంది. అది ఆయనే నిర్ణయించనున్నాడు. సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ 15 నిమిషాలు ఉంటే ఖచ్చితంగా సినిమా స్థాయి ఎక్కడికో వెళ్తుంది. హిందీతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా భారీగా ఈ సినిమా బిజినెస్‌ చేసే అవకాశాలున్నాయి. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కు సన్నిహిత సంబంధాలుంటాయి. ఆ సంబంధాలతో సల్లూభాయ్‌ ఉయ్యాలవాడ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పవచ్చు అని సమాచారం అందుతుంది. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Leave a Reply