పెళ్లి చూపులు కి ఓకే చెప్పిన సల్మాన్

 salman khan remake pelli chupulu movie

టాలీవుడ్‌ నటులు విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మలు ప్రధాన పాత్రల్లో నటించిన పెళ్లిచూపులు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో సల్లూభాయ్‌ తన బావమరిది ఆయుష్‌ శర్మను బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పెళ్లి చూపులు నిర్మాత రాజ్‌ కందుకూరి ధృవీకరించారు. ఈ సినిమా రీమేక్‌ని సల్మాన్‌తో చేయబోతున్నట్లు చెప్పారు.

తెలుగులో పెళ్లిచూపులు చిత్రాన్ని తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు కాబట్టి హిందీ వెర్షన్‌ కూడా ఆయనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆయన్ని ఒప్పించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సల్మాన్‌తో ఈ మీటింగ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఏర్పాటుచేశారు. ఆయనే పెళ్లిచూపులు దర్శకుడిని, నిర్మాతని సల్లూ భాయ్ కు పరిచయం చేశారు. అయితే ఈ రీమేక్‌ హక్కుల కోసం చిత్రబృందం కోటి రూపాయలు డిమాండ్‌ చేసిందని చెప్పుకుంటున్నారు.

SHARE