పాక్ ఆర్టిస్టులకు సల్మాన్ సపోర్ట్… షాక్ ఇచ్చిన దాయాది

 salman khan support tweet pakistani artists

వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లలో తరుచూ వార్తలకెక్కే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మల్లె గొంతు విప్పాడు. ఈసారి పాక్ నటులపై బాలీవుడ్ నిర్మాతల మండలి నిషేధం విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. యురిలో దాడి జరిపింది ఉగ్రవాదులే గాని కళాకారులు కాదని సల్మాన్ వ్యాఖ్యానించాడు. సల్మాన్ చెప్పింది తప్పో, ఒప్పో తర్వాత సంగతి… ప్రస్తుతం దేశంలో నెలకొన్న భావోద్వేగాల్ని ఆయన కనీసం పరిగణించకపోవడం దురదృష్టకరం ..

మరోవైపు పాక్ కళాకారులకు సపోర్ట్ గా సల్మాన్ ట్వీట్ లకు దాయాది దేశం వెరైటీ రిప్లై ఇచ్చింది.. తమ దేశంలో బాలీవుడ్ సినిమాల్నినిషేధిస్తూ చర్యలు తీసుకొంది. సల్మాన్ ఒక్క విషయం గుర్తుంచుకో.. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం…

SHARE