బాబోయ్ అనిపిస్తున్న ‘ట్యూబ్ లైట్’ డ్రిస్టిబ్యూషన్ రైట్స్..!

 Posted March 25, 2017

salman khan tubelight movie records for distribution rights2016లో సుల్తాన్ సినిమాతో చరిత్ర సృష్టించాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా తర్వాత  సల్మాన్ ఖాన్ ని కండల వీరుడు అని పిలవడం మానేసి రింగ్ లో కింగ్ అని, బాక్సాఫీస్ సుల్తాన్ అని పిలుస్తున్నారు. ఈ బాక్సాఫీస్ సుల్తాన్ తాజాగా రెండు సినిమాలను చేస్తున్నాడు. ఒకటి కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ట్యూబ్ లైట్ కాగా రెండవది టైగర్ జిందా హై. ట్యూబ్ లైట్ సినిమాలో చైనా నటి జూజూ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా జూన్ 23న ఈ సినిమా విడుదల కానుంది.

1962లో జరిగిన ఇండో.. చైనా యుద్ధ నేపథ్యంతో  తెరకెక్కుతున్న ట్యూబ్ లైట్ మూవీ పక్కా  ప్రేమ కథా చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా గతంలో కబీర్.. సల్మాన్ కాంబినేషన్  లో తెరకెక్కిన ఏక్ థా టైగర్.. రూ.198 కోట్లు , భజరంగీ భాయ్‌జాన్.. రూ.320 కోట్ల షేర్ ని కలెక్ట్ చేశాయి. అయితే ఈ ట్యూబ్ లైట్ చిత్రం మాత్రం కేవలం డ్రిస్టిబ్యూషన్ రైట్స్ కే  ఏకంగా రూ.130 కోట్లను వసూలు చేసిందని సమాచారం.  ఈ హక్కులను ఫాక్స్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

పంపిణీ హక్కుల విషయంలో ట్యూబ్ లైట్ సినిమాదే రికార్డు అని డ్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే చిత్ర పంపిణీ హక్కులు  రూ.125 కోట్లకు అమ్ముడుపోయాయని, తాజాగా ట్యూబ్ లైట్ ఆ రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. మరి రిలీజ్ తర్వాత ఈ ట్యూబ్ లైట్ ఇంకెన్ని రికార్డులు బ్రేక్  చేస్తుందో చూడాలి.

SHARE