సల్మాన్ కి నిజంగా తెలియదా ?

salman marriageబాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్‌ ఖాన్.. తన జీవితంలో తీరని ఓ రెండు కోరికలను ఇటీవలే బయటపెట్టారు‌. ‘‘నా జీవితంలో ఇంతవరకు జరగనివి రెండే రెండు. ఒకటి పెళ్లి, రెండు శృంగారం. శృంగారమంటే పెళ్లి తర్వాత జరిగేదని నా విశ్వాసం. కానీ ఈ రెండూ నా జీవితంలో ఇంతవరకు జరగలేదు’’ అని సల్లూ భాయ్ తనదైన శైలిలో చెప్పాడు. సోదరుడు సొహైల్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్రీకి అలీ’. ఇందులో నవాజుద్దీన్‌ సిద్ధికీ ప్రధాన పాత్రను ఈ బాలీవుడ్ కండల వీరుడు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రచారంతో ప్రస్తుతం సల్మాన్ బిజీగా గడిపేస్తున్నారు. సల్మాన్ రొమానియాకు చెందిన లులియా వంటూర్ ను వివాహం చేసుకోనున్నారంటూ కొద్దికాలంగా వార్తలొస్తున్నాయి. పెళ్లి చేసుకో అంటూ ఇంట్లోనూ ఒత్తిడి చేస్తున్నారంటూ సల్మాన్ ఇటీవలే చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే.. సల్లూ భాయ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కావచ్చని అంతా అనుకుంటున్నారు.

SHARE