సమాజ్ వాది లో చిచ్చు కారణాలేంటి?

0
460

 samajwadi-party-brecks-reasonsవచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వేళ…సమాజ్‌వాది పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ములాయం కుటుంబం రెండుగా చీలిపోయింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆయోమయం నెలకొంది.. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా యూపీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, బీఎస్పీలు పావులు కదుపుతుంటే ఈ ఎన్నికలు సమాజ్‌వాది పార్టీకి కత్తిమీద సాములా మారాయి.

ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ఎలా బయట పడాలో అర్థం కాక ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ తలమునకలవుతుంటే.. ఆయన కుటుంబ సభ్యులు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు.తన మార్కు రాజకీయంతో పార్టీలో, ప్రభుత్వంలో పట్టు బిగించిన అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి ములాయం సూచనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు ములాయం సోదరులను పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. కేవలం తన భార్య డింపుల్‌ యాదవ్‌ అభిప్రాయాలకే అఖిలేష్‌ విలువ ఇస్తున్నారు.

దీంతో తండ్రీ కొడుకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.తాజాగా అఖిలేష్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలోని ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ అఖిలేష్‌కు సూచించారు. దీంతో ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకే తాను మొగ్గు చూపుతున్నట్లు అఖిలేష్‌ తేల్చి చెప్పారు. అఖిలేష్‌ తీరుతో నొచ్చుకున్న శివపాల్‌ యాదవ్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ములాయం అఖిలేష్‌పై మండిపడ్డారు. శివపాల్‌ ఆలోచనను తప్పు పట్టకూడదని స్పష్టం చేశారు. పరిస్థితినిబట్టి రాజకీయాలను మార్చుకోవాలని సూచించారు. అయితే ములాయం మాటలను అఖిలేష్‌ ఏ మాత్రం పట్టించుకోలేదు.

Leave a Reply