ఈసారి పెద్దాయ‌న వంతు!!

Posted March 23, 2017

samajwadi party leaders are support to mulayam singh yadav for as samajwadi party president
అఖిలేశ్ నాయ‌క‌త్వంలో ఎన్నిక‌ల‌కు వెళ్లిన స‌మాజ్ వాదీ పార్టీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఓట‌మితో ఇప్పుడు మ‌రోసారి ఎస్పీలో ముస‌లం పుట్టింద‌ని స‌మాచారం. ముఖ్యంగా అఖిలేశ్ వ్య‌తిరేక వ‌ర్గం మ‌రోసారి స్పీడ్ పెంచింది. ఈసారి ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్తున్న‌ట్టు స‌మాచారం.

ఎస్పీ అధ్య‌క్ష‌ప‌ద‌విని అఖిలేశ్ ను త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే అఖిలేశ్ బాబాయ్ శివరాజ్ సింగ్.. అన్న ములాయంను క‌లిశార‌ట‌. అఖిలేశ్ నాయ‌క‌త్వంలో ఎన్నిక‌ల‌కు వెళ్లి విఫ‌ల‌మ‌య్యాం.. కాబ‌ట్టి ఆయ‌న్ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కోరార‌ట‌. ఈ మేర‌కు చాలామంది నాయ‌కులు కూడా ములాయంపై ఒత్తిడి తెస్తున్న‌ట్టు టాక్.

మ‌ళ్లీ ములాయంను పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విలో కూర్చోబెట్టేందుకు ముమ్మ‌ర‌ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సమాచారం. ఈ ఎత్తుగ‌డ‌ల‌న్నీ అఖిలేశ్ గ‌మ‌నిస్తున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ఓట‌మి షాక్ లో ఉన్నారు. కాబ‌ట్టి ఇక కొంత‌కాలం సైలెంట్ గా ఉన్నార‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే ఎలాంటి రివ‌ర్స్ ఎత్తుగ‌డ‌లు వేయ‌కుండా మౌనంగా ఉంటున్నార‌ట‌.

అఖిలేశ్ మౌనంతో ఇక పెద్దాయ‌న కూడా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఆదిశ‌గా ఇప్ప‌టికే అంద‌రూ పెద్దాయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ట‌. అఖిలేశ్ వర్గానికి చెందిన వ్య‌క్తులు కూడా ములాయంవైపే మొగ్గు చూపుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో పార్టీపై పెద్దాయ‌న పూర్తి ప‌ట్టు సాధించేశార‌ని టాక్. అన్ని జిల్లాల అధ్య‌క్షులు, ఇత‌ర కీల‌క నాయ‌కులంతా ఇప్పుడు ములాయంతోనే ట‌చ్ లో ఉన్నార‌ట‌. దీంతో ఇక ఆయ‌న‌ను పార్టీ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించడ‌మే మిగిలింద‌ని ఎస్పీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేమ‌రి రాజ‌కీయాల్లో బండ్లు ఓడ‌లు కావ‌డానికి..ఓడ‌లు బండ్లు కావ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. అందుకే అఖిలేశ్-ములాయం క‌థే నిద‌ర్శ‌నం.

SHARE