నాగ్ వల్లే సమంత గెస్ట్ రోల్..!!

 Posted March 23, 2017

samantha accept guest role in savitri biopic movie because of nagarjunaనాగ చైతన్యతో..  సమంత ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుండి ఆమె సినీ కెరీర్ కాస్త డల్ అయ్యిందని చెప్పుకోవాలి. తమ ప్రేమకు నాగార్జున పచ్చ జెండా ఊపిన తర్వాత సమంత గతంలో ఒప్పుకున్న సినిమాల నుండి కూడా తప్పుకుంది. ఇక నిశ్చితార్ధం అయిన తర్వాత నుండి మాత్రం సమంత మెయిన్ హీరోయిన్ గా కాకుండా కీ రోల్స్ లో మాత్రమే నటిస్తోంది. అటు తన కెరీర్ కి, ఇటు అక్కినేని కుటుంబానికి మచ్చ రాకుండా బ్యాలెన్స్డ్ గా, సెలెక్ట్డ్ గా సినిమాలను చేస్తోంది.

ప్రస్తుతం రాజుగారి గది-2లో ఓ కీ రోల్ లో నటిస్తున్న సమంత రీసెంట్ గా సావిత్రి బయోపిక్ లో కూడా నటించనుంది. సావిత్రి సినిమాలో ఆమె జమున పాత్రను పోషిస్తోంది. ముందు ఈ రోల్లో నటించడానికి  సమంత నో చెప్పిందట. అయితే నాగ్ ఆమెను కన్వెన్స్ చేశాడని తెలుస్తోంది.

తమ కుటుంబానికి జమున చాలా సన్నిహితురాలని, అందునా తన తండ్రితో జమున చేసిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయని చెప్పాడట నాగ్.  జమున పాత్ర అనగానే నాగ్..  సమంతకి ఒప్పుకోమని సూచించాడట. కాబోయే మామాగారు చెప్పగానే సమంత సెకండ్ రోల్ అయినా కూడా నటించడానికి  ఎస్ చెప్పిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

SHARE