సముద్రంలా ఉండాలనుకున్న బ్యూటీ..

Posted December 26, 2016

samantha as ocean

భారతీయ సాంప్రదాయంలో స్త్రీలని నదులతో …పురుషుడిని సముద్రంతో పోలుస్తుంటారు. ఈ ఆనవాయితీని బ్రేక్ చేసింది ఓ టాప్ హీరోయిన్ …ఆమె ఇంకెవరో కాదు…సమంత.అక్కినేని వారింటికి పెద్ద కోడలిగా వెళ్ళబోతున్న ఆమె తనను తానే సముద్రంతో పోల్చుకుంటూ ఓ ఫోటోని సోషల్ మీడియా లో ఉంచింది.ఈ ఫోటో ఇప్పుడు నెటిజెన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది.క్రిస్మస్ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో కాస్త గరం పుట్టిస్తున్నా..దాంతో పాటు ఆమె వ్యక్తపరిచిన భావాలు మాత్రం గంభీరంగా వున్నాయి.

samantha as ocean
ఈ ఫొటోతో పాటు ఇంతకీ ఆమె ఏమి చెప్పిందో తెలుసా? తనకు ఉండాలనుకున్న లక్షణాలన్నీ ఆమెకి సముద్రంలో కనిపించాయట.అందం,అంతు చిక్కని రహస్యాలు,సువిశాల తత్వం, స్వేచ్ఛ తో సముద్రం లా బతికేయాలని సమంత కోరికట.అందులో ఏ తప్పు లేదు.అయితే చెప్పే విషయం కన్నా చూపే ఫోటో మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసేట్లుంది.ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బాగుండేదని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు.

SHARE