‘ప్రేమమ్’పై సమంత కామెంట్….

Posted October 7, 2016

  samantha comment naga chaitanya premam movie

‘ప్రేమమ్’పై ప్రాణాలు పెట్టుకొన్నాడు నాగచైతన్య. అచ్చొచ్చిన ప్రేమకథతో హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు. సాంగ్, టీజర్, ట్రైలర్స్ తో చైతూ ‘ప్రేమమ్’పై అంచనాలు పెరిగిపోయాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌ జంటగా శృతీహాస‌న్‌, మ‌డోన్నా స్టెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నటించారు. దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ‘ప్రేమమ్’.

అయితే, చైతూతో పాటు ఈ చిత్రం రిజల్ట్ పై సమంత ఆసక్తిగా ఎదురు చూస్తొంది. చైతూకి సమంత తన బెస్ట్ విషెస్ ను తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ప్రేమమ్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటింగ్‌గా ఉంది, ఈ సినిమా బాగా ఆడుతుందని నాకు తెలుసు నాగచైతన్య” అని సమంత ట్వీట్‌ చేసింది.

ఇక, ఇప్పటికే బయటికొచ్చిన రిజల్ట్ ప్రకారం ‘ప్రేమమ్’ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. దీంతో.. చైతూ, సమంత ఫుల్ ఖుషి అయిపోతున్నట్టు ఫిల్మ్
నగర్ సమాచారమ్. అప్పుడే సెలబ్రేషన్స్ కూడా మొదలెట్టేశారట. 

  1. All the very best to the team of . Excited because I know it’s going to be good

SHARE