సమంత చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

0
792
samantha engagement saree speciality

Posted [relativedate]

samantha engagement saree speciality
టాలీవుడ్ లో ప్రేమపక్షులుగా తిరుగుతున్న సమంత, నాగ చైతన్య పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎప్పట్నుంచో అభిమానులను ఊరిస్తున్న వారి ఎంగేజ్ మెంట్ ఎట్టకేలకు నిన్న అట్టహాసంగా జరిగింది. కాగా అక్కినేని వారింటి  పెద్ద కోడలిగా అడుగుపెట్టనున్న సమంత…  నిన్న ఎంగేజ్ మెంట్ లో కట్టుకున్న చీర డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  

ఈ చీరను సమంత కోరిక మేరకు ముంబై డిజైనర్ క్రేషా బజాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ చీరకున్న స్పెషాలిటీ ఏంటంటే… ఈ చీరపై సమంత తన ప్రేమకథను డిజైన్ చేయించుకోవడమే .   చీర అంచును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ చీరపై చైతూతో తన తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’లోని ఓ సన్నివేశం నుంచి అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫోటో వరకూ డిజైన్ చేయించుకుంది సమంత. ఇంకా చీరపై ఓ బైక్ పై చైతన్యతో కలసి వెళుతున్న చిత్రం కూడా ఉంది. సమంతకి  చైతూపై  ఎంత ప్రేమ ఉందో ఈ చీరను డిజైన్ చేయించుకున్న తీరు చూస్తే తెలుస్తోందని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

Leave a Reply