“అమ్మమ్మ గారి ఇంట్లో”  సమంత

0
577
samantha guest role in naga shourya ammamma gari illu

Posted [relativedate]

samantha guest role in naga shourya ammamma gari illuనాగ చైతన్యతో నిశ్చితార్ధం అయిన తర్వాత సమంత తన సినీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అటు అక్కినేని ఫ్యామిలీకి ఇటు తన సినీ కెరీర్ కి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కధలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇంతకుముందు ఒప్పుకున్న తెలుగు, తమిళ సినిమాలన్నింటిని నుండి తప్పుకుంది. తాజాగా రాజుగారి గది-2, సావిత్రి సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో నటిస్తోంది.

రాజుగారి గది-2లో సమంత  పాత్ర చిన్నదే అయినా ప్రతీ సన్నివేశం ఉద్వేగంతో కూడుకున్నదై ఉంటుందట. సమంత నటించిన సీన్లన్నీ ప్రేక్షకులను కంటతడి పెట్టించే విధంగా ఉంటాయట. ఆమె పాత్రను దర్శకుడు ఓంకార్ చక్కగా తెరకెక్కించనున్నాడట. అలాగే సావిత్రి బయోపిక్ లో సమంత.. జమున పాత్రని పోషిస్తోంది. ఇప్పటి వరకు సమంత ఒప్పుకున్న పాత్రలన్నీ గెస్ట్ రోల్స్ అయినా కూడా అవి స్పెషల్ రోల్స్. అలానే తాజాగా నాగశౌర్య నటిస్తున్న అమ్మమ్మ గారి ఇల్లు సినిమాలో కూడా సమంత గెస్ట్ రోల్ చేయనుందట. కధ పరంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండడంతో సమంత వెంటనే ఓకే చెప్పేసిందట.

కాగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు   లీడ్ రోల్స్ ని  నిరాకరిస్తూ కేవలం గెస్ట్ పాత్రలకే ప్రాధాన్యమివ్వడం సమంత ఫ్యాన్స్ కి రుచింపకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం స్వాగతిస్తున్నారు.

Leave a Reply