స‌మంత మామూలు అమ్మాయే…

0
503
samantha not a dumb women in ram charan movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

samantha not a dumb women in ram charan movieఅక్కినేని నాగ‌చైత‌న్య‌తో ఎంగేజ్ మెంట్ త‌ర్వాత తెలుగులో స‌మంత సినిమా ఏదీ ఇంకా విడుద‌ల కాలేదు. ప్ర‌స్తుతం ఆమె సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ తేజతో క‌లిసి న‌టిస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇప్ప‌టిదాకా ఒక్క సినిమా కూడా లేక‌పోవ‌టం, ఎంగేజ్ మెంట్ త‌ర్వాత స‌మంత న‌టిస్తున్న చిత్రం కావ‌టంతో ఈ సినిమాలో సమంత క్యారెక్ట‌ర్ పై అనేక‌ర‌కాల వార్త‌లొచ్చాయి. చిత్రంలో స‌మంత మాట‌లు రాని మూగ‌మ్మాయిగా న‌టిస్తోంద‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత మూగ క్యారెక్ట‌ర్ కాదు… క‌ళ్లు లేని అంధురాలి ప్రాత్ర చేస్తోంద‌ని వార్త‌లొచ్చాయి. ఈ ఊహాగానాల‌న్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది చిత్ర యూనిట్‌. సినిమాలో  స‌మంత‌ది మామూలు హీరోయిన్  క్యారెక్ట‌రే అని మూగ‌, చెవిటి, గుడ్డి లాంటి ప్ర‌త్యేక పాత్ర కాద‌ని స్ప‌ష్టం చేసింది.  మ‌రోవైపు చిత్రం రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ కావ‌టంతో గోదావ‌రి అందాలకు నెల‌వైన గ్రామాల్లో కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌లపై ఓ పాట‌ను కూడా చిత్రీక‌రించారు. ఇప్ప‌టికే  విడుద‌లైన వర్కింగ్ స్టిల్స్ లో రామ్ చ‌ర‌ణ్ తేజ గెట‌ప్ ఆక‌ట్టుకునేలా ఉంది. మైత్రీమేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టిలు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

Leave a Reply