Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల సంఖ్య చాలా తగ్గించింది. ప్రతి సినిమాను ఒప్పుకోకుండా అడపా దడపా సినిమాలు మాత్రమే చేస్తూ ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. నటనకు ప్రాముఖ్యత ఉన్న ఈ పాత్రలో సమంత పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొదట సమంత ముగ అమ్మాయి అనే ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని తేలింది. తాజాగా సోషల్ మీడియాలో కనిపించిన ఈ ఫొటో తెగ హల్చల్ చేస్తోంది.
ఇప్పటి వరకు చీరల్లో, మోడ్రన్ డ్రస్‌లలో మాత్రమే కనిపించిన ముద్దుగుమ్మ సమంత తాజాగా పంచెకట్టులో కనిపించడంతో అంతా అవాక్కవుతున్నారు. చరణ్ సినిమాలో ఒక సీన్లో తండ్రి రావు రమేష్‌ను ఇమిటేట్ చేసే సీన్ ఉంటుందట. ఆ సీన్ కోసమని సమంతను ఇలా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. పంచెకట్టులో సమంత మరింత అందంగా ఉందని, మంచె, చొక్కాలో సమంత చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నిజంగా కూడా సమంత ఈ లుక్‌లో చాలా బాగుంది కదా. సమంత ఏ డ్రస్ వేసినా ఇంతే. అందుకే సమంత స్టార్ హీరోయిన్ అయ్యిందని ఫ్యాన్స్ అంటున్నారు.