సావిత్రిలో సమంత పాత్ర చిన్నదేం కాదు

0
386
samantha play journalist role in savitri biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

samantha play journalist role in savitri biopic movie
తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి జీవిత కథాంశంతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ ఈ సినిమాను తెలుగు మరియు తమిళంలో నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించనుండగా, సావిత్రి భర్త పాత్ర శివాజీ గణేషన్‌ పాత్రను దుల్కర్‌ సల్మాన్‌తో వేయించనున్నారు. ఇక ఈ సినిమాలో సమంత ఒక జర్నలిస్ట్‌గా కనిపించనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ముందే ప్రకటించారు. అయితే సమంత రోల్‌ చాలా చిన్నగా ఉంటుందని, ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు.

అంతా అనుకుంటున్నట్లుగా సమంత ‘మహానటి’లో చిన్న పాత్ర కాదని, సినిమా ఆరంభం నుండి చివరి వరకు సమంత కనిపిస్తుందని అంటున్నారు. సమంతకు జోడీగా ఈ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా వెళ్లడి చేశారు. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే మరో ఛాన్స్‌ ఈ చిత్రం రూపంలో ఆయనకు వరించింది. ఈసారి సమంతకు జోడీగా నటించబోతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. సమంత పాత్రపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందా అని సినిమాపై ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది.

Leave a Reply