సమంత తీరుపై నాగ్‌ ఆగ్రహం

308
Samantha Posted Bikini Dress In Instagram Nagarjuna Fires On That

ఇటీవలే నాగార్జున, సమంతల మద్య ఒక ఫన్నీ సంఘటన సోషల్‌ మీడియాలో సందడి చేసిన విషయం తెల్సిందే. నాగచైతన్య ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ట్రైలర్‌ విడుదల సందర్బంగా నాగార్జున, సమంతల మద్య వాట్సప్‌ ఛాటింగ్‌ సోషల్‌ మీడియాను ముంచెత్తిన విషయం తెల్సిందే. ఆ విషయం గురించి తెలుగు సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా అంతా చర్చించుకున్నారు. ఇద్దరి మద్య అన్యోన్నత చూసి అంతా కూడా అవాకయ్యారు. అయితే ఇప్పుడు సమంతపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా అదే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత బికినీ డ్రస్‌ను పోస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. సమంత పోస్ట్‌ చేసిన బికినీ పిక్‌ వివాదాస్పదం అయ్యింది. ఈ అమ్మడు అలా చేయడంపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే నాగార్జున కూడా సమంతకు ఫోన్‌ చేసి మరీ క్లాస్‌ పీకినట్లుగా తెలుస్తోంది. పెళ్లి త్వరలో పెట్టుకుని ఇలాంటివి ఏంటి అంటూ సున్నితంగా ఆగ్రహంను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ పరువు నీ చేతిలో ఉంటుందని, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని సమంతో నాగార్జున అన్నట్లుగా చెబుతున్నారు. చైతూ కూడా సమంతను ఆ విషయంమై తప్పుబట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సమంత చేసిన ఆ పోస్ట్‌ చిక్కులు తెచ్చి పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here