మహానటిగా చేయనంటున్న సమంత..!

Posted December 15, 2016

Samantha Rejects Mahanati Movie For That Causeసౌత్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన చెన్నై బ్యూటీ సమంత సావిత్రి బయోపిక్ గా వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అన్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా నుండి సమంత ఎక్సిట్ అయ్యిందట. దీనికి కారణం ఏంటని తెలుసుకుంటే సావిత్రి బయోపిక్ లో నటించేందుకు దర్శక నిర్మాతలు సమంతను కాస్త లావెక్కాల్సిందిగా కోరారట. సినిమా కోసం రిక్స్ తీసుకోలేనని సమంత సారీ చెప్పేసిందట.

త్వరలో అక్కినేని కోడలిగా మారబోతున్న సమంత సావిత్రి జీవిత గాథలో నటిస్తుందని తెలియగానే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. కాని ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ ఆ సినిమా నుండి తప్పుకుంది సమంత. కేవలం ఆమెలా లావుగా కనిపించడానికి నిరాకరించే సమంత ఈ గొప్ప అవకాశం వదులుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. సినిమా అవకాశాలు రావట్లేదు అంటూనే వచ్చిన ఈ లక్కీ ఛాన్స్ ను వదులుకుంది సమంత.

ఇక సమంత కాదన్నది కాబట్టి మొదటినుండి వార్తల్లో నిలుస్తున్న నిత్యా మీనన్ కే చిత్రయూనిట్ మొగ్గుచూపుతున్నారట. నిత్యా కూడా ఓకే చెప్పేయడంతో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. సమంత వదులుకున్న ఛాన్స్ పట్టేసిన నిత్యా మహానటిగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

SHARE