Posted [relativedate]
అభిమానులతో టచ్ లో ఉండటం ముద్దుగుమ్మ సమంతకి భలే ఇష్టం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. సినిమా, ఈ మధ్య పర్సనల్ విషయాలని కూడా అభిమానులతో పంచుకొంటోంది. తాజాగా, ట్విట్టర్ ద్వారా అభిమానులతో చేసిన చిట్ చాట్ లో.. ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది.
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు..జీవితంలో చైతూ,మస్కతీ ఐస్క్రీమ్,వర్క్ లేనిదే బతకలేనని సమాధానిమిచ్చింది.అంతేకాదు..చైతూనే ఎందుకు పెళ్లాడాలి.. నన్ను చేసుకోవచ్చు కదా.. ?అన్న ప్రశ్నకు సామ్స్ సమాధానమిస్తూ..నిన్ను పెళ్లి చేసుకోకూడదు.ఎందుకంటే.?నేను నిన్ను 8 సంవత్సరాల క్రితం కలవలేదు. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది. మొత్తానికి..చైతూ అంటే ఎంత ఇష్టమో మరోసారి అభిమానులకి చెప్పింది సమంత. అన్నట్టు.. చైతూ-సమంత వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.
Samantha Ruth Prabhu Retweeted Usha Vavveti
Chay, masqati ice cream and work