సమంత ది గ్రేట్ ..

  samantha the great attitude
జీవితంలో ఎంత దక్కినా …ఇంకా దక్కాల్సింది ఉందనుకొనే అసంతృప్తులకి …జీవితంలో ఏది దక్కినా అదంతా తమ ఘనతే అని ఛాతీ విరుచుకుని విర్రవీగే అహంకారులకి …సమంత మాటలు నిజంగా జీవిత పాఠాలే.ఇంతకీ సమంత ఏమి చెప్పిందనేగా మీ డౌట్ ? అక్కడికే వస్తున్నాం..

ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సమంత అనుకోకుండా చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది.వరుస సక్సెస్ లతో దక్షిణాదిన టాప్ హీరోయిన్ లలో ఒక్కరిగా నిలిచారు.మధ్యలో కొద్ది రోజులు అనారోగ్యంతో షూటింగ్ లకి దూరమయ్యారు.అప్పుడు ఆసుపత్రిలో వున్నప్పుడు జీవితాన్ని లోతుగా పరిశీలించడం అలవాటు చేసుకున్నారు.సేవా మార్గం వైపు మళ్లారు.అంతలోనే నాగ చైతన్య తో ప్రేమ ..ఓ పెద్దింటి కోడలిగా వెళ్లే అవకాశం వచ్చింది.ఇంత నాటకీయంగా జీవితంలో అద్భుత అవకాశాలు వస్తే ఎవరైనా అంతా తమ ఘనతే అనుకుంటారు ..మరికొందరి ఇంతేనా ఇంకా చాలా కావాలని అత్యాశకి పోతారు.

కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది.తన జీవితం ఏడు వింతల్ని మించిన ఎనిమిదో వింతని చెప్పింది.తన జీవితంలోసాధ్యం కావనుకున్న చాలా సునాయాసంగా జరిగాయని సమంత వివరించారు.జీవితంలో తనకి దొరికిన పేరు ,అవకాశాలు,సౌకర్యాలు ఇవన్నీ చూశాక అసంతృప్తికి స్థానం లేదని..పూర్తి సంతృప్తి ఉందని తెలిపారు.అందులో తన గొప్పేమీ లేదని సమంత వినయంగా చెప్పుకున్నారు.చిన్న వయసులో …గ్లామర్ ప్రపంచంలో వుంటూ..అన్ని విధాలుగా సక్సెస్ చవిచూస్తూ …ఇంత డౌన్ టు ఎర్త్ వున్న సమంత ది గ్రేట్ అనకుండా ఉండగలమా?

SHARE