అత్తరు జల్లిన సమంత ..

 samantha throwing perfume marriage guests
సమంత.. తెలుగు సినిమా ఇండ్రస్టీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. కోటి రూపాయలు దాటి రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాల్ని మరిచిపోకూడదు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అందుకే డబ్బుల కోసం గతంలో తను ఎన్ని కష్టాలు పడిందీ చెప్పుకొచ్చింది. నాకు పధ్నాలుగేళ్లు వచ్చేసరికే డబ్బు సంపాదన మొదలుపెట్టా. ఏ పని దొరికితే ఆ పని చేసేదాన్ని. పెద్దవారి ఇళ్లల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు గుమ్మం దగ్గర నిలబడి అతిథులపై పన్నీరు చల్లే పనికి కూడా వెళ్లేదాన్ని. మూడు గంటలు నిలబడితే వెయ్యి రూపాయలు ఇచ్చేవారు.

అలా కష్టపడి సంపాదించిన డబ్బు ఎంతో సంతౄప్తినిచ్చేది. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా అప్పటి ఆనందం మాత్రం ఉండడం లేదని చెప్పింది. క్యూటీ సమంత చాలా నాటీ కూడా. తను సంతోషంగా ఉండటమే కాదు తన చుట్టూ ఉన్నవాళ్లని కూడా సరదాల్లో ముంచేస్తుంది. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ పాట చిత్రీకరణ కోసం కేరళలో ఉంది సమంత. అక్కడి అందమైన లొకేషన్లకి ఫిదా అయిపోయిన శామ్స్.. యూనిట్ మొత్తాన్ని షూటింగ్ ఆపేలా చేసింది. జలపాతం వద్ద షూటింగ్ జరుగు తుండగా.. ముందు తమతో కలిసి తడవాల్సిందేనంటూ డైరక్టర్ కొరటాల శివని ఒప్పించింది. సమంత సంబరపడటంతో షూటింగ్‌కి కాసేపు బ్రేక్ ఇచ్చి యూనిట్ మొత్తం ఆ చిరుజల్లుల్లో తడిసి ముద్దయ్యింది. ఆ సంతోషాన్నంతా ఫొటోతో సహా ట్విట్టర్‌లో షేర్ చేసింది సమంత.

SHARE