Posted [relativedate]
సౌత్ సూపర్ హీరోయిన్ సమంత తను చేసిన సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాదు తనకు నచ్చిన ప్రతి సినిమా గురించి తను ప్రస్థావించి ఇండైరెక్ట్ గా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగమవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన మెగా పవర్ స్టార్ ధ్రువ సినిమా చూసిన సమంత తన రెస్పాన్స్ ను ట్వీట్ చేసింది. సినిమా మొదటి నుండి చివరి వరకు గ్రిప్పింగ్ తో చేశారని అన్న సమంత టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పింది.
ఇక దీనికి వెంటనే రిప్లై కూడా ఇచ్చింది ధ్రువ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘నీకు నచ్చింది అదే చాలు.. థాంక్స్’ అంటూ రకుల్ సమంతకు రీ ట్వీట్ చేసింది. అసలు సమంత తనకు సినిమా మీద కలిగిన అభిప్రాయాన్ని ట్వీట్ చేయడానికి కారణం సుకుమార్ సినిమాలో చరణ్ తో సమంతనే హీరోయిన్ గా ఒకే అవడమే అంటూ కొందరు అంటున్నారు. స్వతహాగా ఏ సినిమా చూసినా సమంత సినిమా పట్ల తన అనుభూతిని ట్వీట్ చేయడం మాములే. మరి దీనికి ఆమె సినిమాకు సంబంధం ఉంది అంటున్న వాదనలు ఏమాత్రం నిజమో తెలియాలి.
పెళ్లి చేసుకోబోతున్నా కాబట్టే తనకు అవకాశాలు రావట్లేదు అన్న సమంతకు చరణ్ ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు జనవరి పొంగల్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.