మ్యూజిక్ డైరక్టర్ కు సమంత వార్నింగ్..!

ss1316సమంత ఏంటి వార్నింగ్ ఏంటి అని మీరు కంగారు పడొచ్చు. కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న ఓ కుర్ర డైరక్టర్ గురించి సమంత అన్న సరదా మాటలివి. తమిళ్ లో స్టార్ సినిమాలే అంటే సంగీతం ముందు అతన్నే అడుగుతారు.. కొలవెరి డితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుథ్ రవిచంద్రన్ ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. లాస్ట్ ఇయర్ బ్రూస్ లీ చేయాల్సింది కాని కుదరలేదు.

ఇక అఆకు ముందు అతన్నే అనుకున్నారు కాని చివరి నిమిషంలో మిక్కిని తీసుకున్నారు. కోలీవుడ్లో బిజీ అవ్వడం వల్ల తెలుగులో మంచి అవకాశాలు వచ్చినా చేయలేకపోతున్నాడు అనిరుథ్. అయితే ఈసారి మాత్రం త్రివిక్రం పవన్ సినిమాకు తాను ఓకే అన్నట్టు టాక్. అదే విషయాన్ని రెమో ఆడియోలో ప్రస్థావించిన సమంత ఈసారి మిస్ అయ్యేట్టు ఉంటే కిడ్నాప్ అయినా చేసేస్తాం అన్నట్టు మాట్లాడింది. అయినా త్రివిక్రం, పవన్ సినిమాల గురించి సమంత ఎందుకు ఆలోచిస్తుంది అంటే ఆ కాంబోలో వచ్చే సినిమాకు సమంతనే హీరోయిన్ అన్న టాక్ వినపడుతుంది. మరి అందుకే కాబోలో అనిరుథ్ కి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది ఈ అమ్మడు.

SHARE