ఐఫా అవార్డుల్లో సమంత చీరే స్పెషల్..

0
491
samantha wearing saree special in IIFA awards

 Posted [relativedate]

samantha wearing saree special in IIFA awardsటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్థానాన్ని దక్కించుకున్న  సమంత ఏం  చేసినా చాలా స్పెషల్ గా చేస్తుందని, చాలా మెక్చ్యూరిటీతో వ్యవహరిస్తుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఇటీవల జరిగిన తన  ఎంగేజ్ మెంట్ లో  కూడా ఆమె తన ప్రేమ గురించి వ్యక్తమయ్యే విధంగా చీరలో డిజైన్ చేయించుకుందని, ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఆ విధంగా చేయలేదని చెబుతున్నారు. తాజగా ఐఫా అవార్డుల సందర్భంగా కూడా ఆమె కట్టిన చీరలో చాలా ఆంతర్యం ఉందని కితాబిస్తున్నారు.

సమంత తెలంగాణ చేనేత ప్రచారకర్త అన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఐఫా అవార్డులకు కూడా చేనేత దుస్తుల్లోనే మెరిసింది. సమంతను ఇంత సింపుల్ గా చూసిన ప్రతిఒక్కరు ముందర ఆశ్చర్యపోయినా అసలు విషయం తెలుసుకున్న వారు సమంత తెలివికి జోహార్లు చెప్పారు. సౌత్ సెలబ్రిటీస్ వచ్చే ఐఫా అవార్డులకు చేనేత వస్త్రాలు ధరిస్తే ఆ వస్త్రాలకు మరింత పబ్లిసిటీ వస్తుందని భావించిందట సమంత. చేనత చీరను ధరించడంతో పాటు ఆ చీరపై తెలంగాణా రాష్ట్ర గుర్తులను కూడా డిజైన్ చేయించింది. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, రాష్ట్రపక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు.. ఇలా తెలంగాణ రాష్ట్ర గుర్తులను కొట్టొచ్చేట్టు డిజైన్ చేయించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా సమంత చీర కట్టడంపై పలువురు ప్రశసంలు కురిపిస్తున్నారు. ఏమైనా మన తెలుగు రాష్ట్రం గురించి సమంత ఇచ్చిన పబ్లిసిటీకి నిజంగా హ్యాట్సాప్ చెప్పిల్సిందే.

Leave a Reply