సామ్‌సంగ్‌ నుంచి సూపర్‌ మొబైల్‌..

samsung flip model is being launched
చాలా కాలం తరవాత ఫ్లిప్‌మోడల్‌.. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఒకేటే తరహా మొబైళ్లు దర్శనమిస్తున్నాయి.. అదే టచ్‌ అవే దీర్ఘచతురస్రాకార మొబైళ్లు రూ.2వేలు పెట్టిన రూ.50వేలు పెట్టినా ఫీచర్లు మారుతున్నాయి తప్పా ఆకారానికి అవే మోడళ్లు.. దీంతో కొంత భిన్నత్వం కోరుకునేవారికి నిరాశకలుగుతుంది. దీన్ని గుర్తించిన సామ్‌సంగ్‌ అదిరిపోయే మొబైల్‌ తీసుకురాబోతుంది.. రెగ్యులర్‌ ఫోన్లకు భిన్నంగా డ్యుయల్‌ స్ర్కీన్స్‌ ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకురాబోతుంది. అంతేకాదండోయ్‌.. అది కూడా ఫ్లిప్‌(మడతపెట్టేది మోడల్‌) ఫోన్‌.. డబ్యూ2017 అనే పేరుతో త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించిది. చూడ్డానికి వెరైటీగా ఉండి ఫీచర్లు సాధారణం అనుకునేరు.. స్పెసిఫికే షన్లు సైతం అద్భుతంగా ఉన్నాయి…ప్రస్తుతం చిప్‌సెట్‌లో టాప్‌లోఉన్న స్నాప్‌డ్రాగర్‌ 820తో దీంట్లో ఇమడనుంది.. ర్యామ్‌ 4జీబీ, ఇంటర్నల్‌ మెమరీ 64 జీబీ, ముందు 5 ఎంపీ, వెనుక 12 మెగాఫిక్సిల్‌ కెమెరా, బ్యాటరీ 2300 ఎంఏహెచ్‌, ఫ్రింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫుల్‌ హెచ్‌డీ స్ర్కీన్‌, తెర 4.20 అంగుళాలతో ఓ రేంజ్‌లో ఉండబోతుంది.. ప్రస్తుతం మొబైల్‌ ప్రకటించినా ధర ఎంత.. ఎప్పటి కల్లా మార్కెట్‌లోకి వస్తుంది అనే విషయాలు సంస్థ వెల్లడించడలేదు. మరి ఈ అరుదైన మొబైల్‌ని సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి మరి…

SHARE