మాయగాడు సందీప్ ని నిలబెడతాడా ?

0
551
sandheep kishan movie mayagadu

sandheep kishan movie mayagadu
కొత్తదనం కోసం ఒక ప్రయత్నం ..ఆ కొత్తదనం వల్ల వచ్చే విజయాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసే మరో ప్రయత్నం…ఈ రెండు ప్రయత్నాలు ఒకదానితో ఒకటి క్లాష్ అయితే …ఎదురయ్యేది అయోమయమే …ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే వున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్ .మంచి నటనా సామర్ధ్యం వున్న ఈ కుర్రహీరో ఒకటి రెండు విజయాలు వచ్చాక ….ఆ స్థానాన్ని నిలబెట్టుకోడానికి తనకు తెలియకుండానే …సక్సెస్ ఫార్ములా వైపు పరుగు తీశాడు.అయితే సక్సెస్ రాకపోగా ఏ సినిమాలు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది .

ఈ సందిగ్ధ సమయంలో మాయగాడు తో మళ్ళీ సందీప్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .ఇది తమిళ్ సినిమా మాయావన్ కి డబ్బింగ్ వెర్షన్.ఇంతకుముందు పిజ్జా సినిమా తీసిన నిర్మాత సి.వీ.కుమార్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకొస్తున్నాడు .చిత్రం పోస్టర్స్ చూస్తున్నా …డైరెక్టర్ టేస్ట్ చూస్తున్నా సందీప్ మాయగాడితో ట్రాక్ మీదకు వస్తాడనిపిస్తోంది .

Leave a Reply