ఇది మరో బాహుబలి అన్నారు.. అలా కనిపించడం లేదేం?

Posted May 19, 2017 at 17:58

sanghamitra first look release
‘బాహుబలి’ చిత్రం తర్వాత బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా భారీ బడ్జెట్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మంచి సినిమాను చేస్తే తప్పకుండా కలెక్షన్స్‌ వస్తాయని నిరూపితం అయ్యింది. దాంతో తమిళంలో దర్శకుడు సుందర్‌ ‘బాహుబలి’ చిత్రాన్ని మించిన సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ‘సంఘమిత్ర’ అనే సినిమాను తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. అతి త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.

శృతి హాసన్‌, జయం రవితో పాటు ఇంకా పలువురు తమిళ నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నారు. తమిళనాట భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా రివీల్‌ చేయడం జరిగింది. అయితే ఫస్ట్‌లుక్‌ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించే విధంగా లేక పోవడంతో పాటు, క్వాలిటీ వర్క్‌ పోస్టర్‌లో కనిపించడం లేదు. దాంతో షూటింగ్‌ ప్రారంభంకు ముందే ‘బాహుబలి’ స్థాయిని దరి దాపుల్లోకి కూడా ‘సంఘమిత్ర’ వెళ్లలేదని అంటున్నారు. పెట్టిన బడ్జెట్‌ను రికవరీ చేస్తే అదే గొప్ప అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

SHARE