బాహుబలికి పోటీగా రాబోతున్న ‘సంఘమిత్ర’

0
352
sanghamitra in competation with bahubali

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sanghamitra in competation with bahubali
‘బాహుబలి’ సక్సెస్‌తో భారీ బడ్జెట్‌ సినిమాు సౌత్‌లో మరిన్ని వస్తున్నాయి. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమాలో కంటెంట్‌ ఉంటే ఎంత బడ్జెట్‌ అయినా పెట్టవచ్చని బాహుబలి నిరూపించింది. మొదటి పార్ట్‌ 650 కోట్లు వసూళ్లు సాధించగా రెండవ పార్ట్‌ 1250 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రికార్డులను సమీప భవిష్యత్తులో ఏ సౌత్‌ సినిమాలు బ్రేక్‌ చేయలేవని అంతా భావిస్తున్నారు. అయితే ఆ రికార్డుల బ్రేక్‌ కోసం మాత్రం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

తమిళంలో భారీ పౌరాణిక సినిమా నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సుందర్‌ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కబోతుంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సుందర్‌ ఆ సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్‌ వర్క్‌ జరిపిన సినిమాను మరో వారం రోజుల్లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. జయం రవి, ఆర్య, శృతిహాసన్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల చేయబోతున్నారు. షూటింగ్‌ ప్రారంభం కాకుండానే అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్ట్‌లోకి వెళ్లింది అంటే, విడుదలైతే సంచలనాలు ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. బాహుబలిని ఖచ్చితంగా ‘సంఘమిత్ర’ క్రాస్‌ చేస్తుందని తమిళ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. బాహుబలి మాదిరిగానే ‘సంఘమిత్ర’ను కూడా అన్ని సౌత్‌ భాషల్లో మరియు బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

Leave a Reply