సానియా మీర్జా గ్రేట్ ఎస్కేప్ …

Posted December 7, 2016

saniya mirza gave smart answer to sajid khan question in yaaron ki baraat show zee tvభారత టెన్నిస్ క్రీడా కారిణి సానియా మీర్జా గురించి తెలియని వారు దాదాపు ఉండరు.ఆమె పాకిస్తాన్ కు చెందిన షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఐతే సానియా చాల తెలివి గా ఒక ప్రశ్న గురించి తప్పించుకొన్నారు తెలుసా.అదేంటో చదువుదామా.

జీ టీవీ నిర్వహించే ‘యాదోంకీ బారాత్’ కార్యక్రమంలో పాల్గొన్నది అట. బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్, సానియాను ఓ ప్రశ్న అడిగి ఇరుకున పెట్టాడట ..స్వతహాగా క్రీడా కారిణి కదా ఊహించని ప్రశ్న ఐనా స్మాష్ షాట్ లాంటి ఆన్సర్ ఇచ్చి తప్పించుకొంది.

“ప్రతి భారత, పాకిస్థాన్ పౌరుల తరఫున ఈ ప్రశ్నను అడుగుతున్నాను. మీకు వివాహమై ఆరేళ్లు గడుస్తోంది. ఇక ఇప్పుడు మీకు భగవంతుడు పిల్లలను ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నా. మీకు, షోయబ్ మాలిక్ కు కుమారుడు పుట్టి, ఆటగాడైతే, ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు?” అని అడిగాడు.

“నిజాయతీగా చెబుతున్నాను. ఈ విషయాన్ని గురించి మేము ఎన్నడూ చర్చించలేదు. మాకు తెలియదు కూడా. మా బిడ్డ ఆటగాడే ఎందుకు కావాలి? నటుడు కావచ్చు. టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. ఇది చాలా దూరంలో ఉన్న విషయం. భారతీయురాలినైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. పాకిస్థానీ అయినందుకు అతనూ అంతే. మేమిద్దరమూ కలిస్తే, భార్యాభర్తలమైనందుకు ఇంకా ఎంతో గర్విస్తుంటాము” అని సానియా సమాధానం ఇచ్చిందట..

SHARE