కాంగ్రెస్ లో దశాబ్దాలుగా కీలక నేత INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవ రెడ్డి… అధిష్టానం మనసెరిగి ప్రవర్తిస్తారు ఈయన. బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా వుండే ఈ పెద్దమనిషి ఓ కీలక విషయాన్ని మాత్రం దాచుకోలేక పోయారు. అదేంటో మీరూ చూడండి.
కాంగ్రెస్, YSR కాంగ్రెస్ త్వరలో కలిసిపనిచేస్తాయని సంజీవ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే జరిగితే AP, తెలంగాణ లో తమదే అధికారమని కూడా ఆయన అన్నారు. రెండు పార్టీలను ఒక్క తాటిమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పిన సంజీవరెడ్డి అంతకు మించి వివరాలు అడగొద్దన్నారు. అసలు విషయం చెప్పాక మిగతావి అల్లుకుపోవటం మీడియాకు పెద్ద పనేం కాదులే పెద్దాయన…