స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ రివ్యూ

0
355
saptagiri express review

Posted [relativedate]

saptagiri express review

చిత్రం : స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్

నటీనటులు : స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్ , పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్ ఘోష్ , హేమ, భావ‌న‌, డా.శివ‌ప్ర‌సాద్ , రైజింగ్ రాజు,

సంగీతం :  బుల్ గ‌నిన్

దర్శకత్వం : అరుణ్ ప‌వార్

నిర్మాత :  డా. కె. ర‌వికిర‌ణ్

బ్యాన‌ర్ :  సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేష‌న్స్ ప్రై లి.

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్, 2016.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ గా ప్రూవ్ చేసుకున్న  సప్తగిరిని  ప్రధాన పాత్రగా   కామెడీ ని పండించి  క్యాష్ చేసుకున్నాయి బోలెడన్ని సినిమాలు . అయితే సప్తగిరి కూడా అందరి కమెడియన్స్ లాగానే హీరోగా వస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. హీరో అవ్వాలని తన సొంత డెసిషనో లేక బలవంతం మీద వచ్చాడా అనే విషయాలు పక్కనపెడితే సప్తగిరి  ని హీరోగా జనం చూస్తారు పర్వాలేదు అనిపించుకున్నాడు ఈ సినిమా తో.  అయితే ఈ సినిమా అందరూ ఊహిస్తున్నట్టు పక్కా కామెడీ మూవీయే కాకుండా  ఎమోషన్ ను కూడా బాగానే క్యారీ చేసారు. సీరియస్ కథతో వచ్చిన తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమానుంచి మంచి కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకొని దానికి కామెడీ తో కలరింగిచ్చి బాగానే తెరకెక్కించారు . అయితే అనవసరమైన కామెడీ సీన్స్ తో మంచి కథను స్పాయిల్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని కొన్ని సీన్స్ లో…  కొన్ని ఎమెషనల్ సీన్స్, కామెడీ సీక్వెన్సెస్ జనాన్ని బాగానే కూర్చోబెడతాయి.  కానీ  సినిమా బిగినింగ్ లో వచ్చే నాటకం సీన్, హీరో , త‌న తండ్రి దగ్గరచెప్పే దానవీర శూరకర్ణ డైలాగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

 క‌థ :

సినిమా నటుడౌదామని నాటకాలతోనూ , చిల్లర వేషాలతోనూ కాలక్షేపం చేస్తుంటాడు సప్తగిరి (స‌ప్త‌గిరి) . అతడి తండ్రి సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ (డా.శివ‌ప్ర‌సాద్ ) . తన లాగే తన కొడుకును కూడా పోలీస్ ను చేసి మురిసిపోదామనుకుంటాడు. కానీ సప్తగిరి చేష్టలు ఆయన్ను బాగా బాధపెడతాయి. ఇదిలా ఉండగా కొన్ని అనూహ్యపరిస్థితుల్లో సప్తగిరి తండ్రి మరణిస్తాడు. తండ్రి ఉద్యోగం కొడుక్కి ఇస్తారు. కానిస్టేబుల్ గా డ్యూటీ లో చేరతాడు.  అప్పుడు ఆ ఉద్యోగంలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆయనది సహజమరణం కాదని, తన తండ్రిని ఎవరో మర్డర్ చేసారని దానికి కారకులు  కూడా ఎవరో తెలుసుకుంటాడు.  తండ్రి గొప్పతనం తెలుసుకున్న సప్తగిరి చివరికి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే మిగతా కథ. తమిళ్ సినిమాను యాజిటీజ్ గా తీసుకున్నా సరే తమిళ్ లో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎన్నికష్టాలున్నాయో హీరో తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవనిపిస్తుంది. కొత్త దర్శకుడు అరుణ్ పవార్ అనుభవరాహిత్యం ఆ సీన్స్ లోనే తెలుస్తుంది. మొత్తం మీద సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి.

న‌టీ నటుల పెర్ఫార్మెన్స్ :

కానిస్టేబుల్ సప్తగిరిగా సప్తగిరి బాగానే నటించాడు. అయితే అతి లేకుండా , హీరో బిల్డప్పుల్లేమీ లేకుండా మామూలు హీరోగానే నటించడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. హీరోయిన్ సంగతి అయితే చెప్పుకోడానికి ఏమీలేదు. అసలు ఆమె హీరోయిన్ మెటీరియలే కాదనిపిస్తుంది. అంతేకాదు , ఆమె పాత్రను ఈ సినిమాలో లైట్ తీసుకున్నారనిపిస్తుంది. ఇక ఇల్లీగల్ బిజినెస్ లు చేయించే సి.ఐ గా కన్నింగ్  విలన్ గా పోసాని కృష్ణమురళి పర్వాలేదనిపిస్తాడు. అజయ్ ఘోష్ పాత్రకు పెద్దగా ప్రధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. అసలు ఆయన్ను దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయాడనిపిస్తుంది.హీరో తండ్రి పాత్రలో డా.శివప్రసాద్  బాగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ గా మరో కానిస్టేబుల్ పాత్రలో   షకలక శంకర్ ఈ సినిమాకు ఎంతో రిలీఫ్ గా అనిపిస్తాడు. అతడు పండించిన కామెడీ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక గేస్ గా నటించిన జబర్దస్త్ కమెడియన్స్ గ్యాంగ్ చేసే కామెడీ కూడా బాగానే నవ్విస్తుంది.  టోటల్ గా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ నే హిలేరియస్ గా పేలాయి. అయితే   తమిళ్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాను అంతగా  ఎంజాయ్ చేయలేరు.   మొత్తం మీద హీరోగా సప్తగిరి ఓకె అనిపించుకున్నాడు. 

ప్లస్ పాయింట్స్ :

కామెడీ

సప్తగిరి నటన

మైనస్ పాయింట్స్ :

ల్యాగ్ సీన్స్

హీరో్యిన్ 

సంగీతం

సాంకేతికంగా :

ఈ సినిమాలో  సాంకేతిక ప‌రంగా చెప్పుకోవాల్సిన అంశాలేమీ పెద్ద‌గా లేవు. కాక‌పోతే  సినిమాటో గ్ర‌ఫీ కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సంగీతం సో సో గా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెప్పుకోద‌గ్గ‌గా లేద‌నే చెప్పాలి. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు ఒరిజిన‌ల్ మూవీ లో చాలా బాగా కుదిరాయి. కానీ తెలుగు వెర్ష‌న్ ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి సీరియ‌స్ స్థానంలో కామెడీ చేర‌డంతో  ఒరిజిన‌ల్ సోల్ మిస్ అయిన‌ట్టు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ ని మ‌రింత ఇంట్రెస్టింగ్ గా తీసి ఉండుంటే స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ ఇంకా బాగుండేంది.

తెలుగు బుల్లెట్ అనాలిసిస్ :

 మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ సినిమా క‌నెక్ట్ అయితే బాక్సాపీస్ వ‌ద్ద పాస‌యిపోయిన‌ట్టే. ఫ‌స్టాఫ్ లో కామెడీ క‌న్నా సెకండాఫ్ లో వ‌చ్చే కామెడీ సీన్స్ జ‌నాన్ని బాగానే ఎంట‌ర్ టైన్ చేసాయి. మధ్య మ‌ధ్యలో కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి . ముఖ్యంగా బిగినింగ్ లో వ‌చ్చే రామ ప‌ర‌శురామ నాట‌కం సీన్ ప‌ర‌మ బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఆ సీన్ ను కొంచెం ట్రిమ్ చేస్తే బెట‌ర్ . ఇక ఫైనల్ గా చెప్పాలంటే , త‌మిళ్ సినిమా చూడ‌ని వాళ్లు ఈ సినిమా కు బాగానే క‌నెక్ట్ అవుతార‌నిపిస్తుంది.  టోట‌ల్ గా స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ ను ఒక సారి ఎక్కొచ్చేమో అనిపిస్తుంది.

బాట‌మ్ లైన్ : స‌గం ఎక్స్ ప్రెస్ …. స‌గం పాసింజ‌ర్

రేటింగ్ : 2.5 /5

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply