Posted [relativedate]
కమీడియన్లుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన నటులు చాలామందే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా అలీ, సునీల్ గురించి చెప్పుకోవచ్చు. వీరు చేసిన అన్ని సినిమాలు హిట్ కాకపోయినా హీరోలుగా అయితే ఫ్రూవ్ చేసుకున్నారు. వీరు కమీడియన్లుగా చేస్తునే కొన్ని సినిమాల్లో హీరోలుగా కూడా నటిస్తున్నారు. తాజాగా సప్తగిరి కూడా ఇదే జాబితాలోకి చేరిపోయాడు.
ప్రేమకధా చిత్రమ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి హిట్ సినిమాల్లో కమీడియన్ గా మంచి పేరు సాధించాడు సప్తగిరి. ఇటీవల సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా యావరేజ్ అయినా సప్తగిరి నటనకు ప్లస్ మార్కులే పడ్డాయి. దీంతో హీరోగా మరో సినిమాకు సైన్ చేశాడు. ‘రివాల్వర్ రాజు’ అనే చిత్రంలో హీరోగా నటించేందుకు సైన్ చేశాడు. వేరే చిత్రాలలో కమీడియన్ గా నటిస్తూనే హీరోగా కూడా ప్రేక్షకులను అలరిస్తానని అంటున్నాడు. మరి సప్తగిరి రెండో సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.