Posted [relativedate]
సచిన్ టెండుల్కర్… ఈ పేరు తెలియని వారు ఉండరు, క్రికెట్ కి ఎంత ప్రయారిటీ ఇస్తాడో,ఫ్యామిలీ కి అలాంటి ప్రయారిటీ ఇస్తాడు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సచిన్ కూతురు సారా టెండుల్కర్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా ఆమె హీరో రణవీర్ సింగ్ తో కలసి దిగిన సెల్ఫీ ఒకటి బయటకొచ్చింది. అప్పుడు అందరు సారా త్వరలోనే సినిమా తెరంగేట్రం చేస్తోందంటూ వార్తలు వచ్చేశాయి. కాని సచిన్ అలాంటిది ఏమిలేదు అని తన కూతురు చదువుకుంటోందని, అది అభిమానంతో దిగిన ఫొటోస్ అని చెప్పాడు. .. ఇప్పుడు మరోసారి సారా కొత్త ఫోటోలు బయటికి వచ్చాయి.
నిన్న ముంబాయి లో ”ముంబయ్ ఇండియన్స్” టీమ్ ఐపిఎల్ లో పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అంబానీ గ్రాండ్ గా ఒక పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో క్రికెటర్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఈ పార్టీలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ మరియు అతని బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చారు. ఈ పార్టీలో సారా, జాన్వి ఆమె ప్రియుడు శిఖర్ పహరియా తెగ తిరిగేశారు. కాని విశేషం ఏంటంటే.. జాన్వి అండ్ శిఖర్ కలసి ఒక్క ఫోటోకు కూడా ఫోజులివ్వలేదు కాని.. సచిన్ కూతురు సారా మాత్రం శిఖర్ తో కలసి ఫోటోగ్రాఫర్లకు రకరకాలు ఫోజులిచ్చింది. జాన్వి బాయ్ ఫ్రెండ్ తో ఇలా సారా ఫొజులివ్వటం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి