Posted [relativedate]
రాజగురువు….తెలుగు రాజకీయాల గురించి ఏ కాస్త పరిచయం వున్నవారికైనా ఆ ప్రస్తావన రాగానే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గుర్తొస్తారు.ఆయన మాట టీడీపీ అధినేత చంద్రబాబు తూచా తప్పకుండా వింటాడని చెప్పేందుకు సాక్షి పత్రిక అప్పట్లో ఈ రాజగురువు అనే మాటకి విశేష ప్రాచుర్యం కల్పించింది.బాబుకి రామోజీ రాజగురువు అన్న మాటల్లో నిజమెంత అన్నది చెప్పలేకపోయినా…వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ పోస్ట్ కొట్టేయడానికి మాత్రం ఓ స్వామీజీ తహతహలాడుతున్నారు.ఆయనే పెందుర్తిలో శారదా పీఠం నడుపుతున్న స్వరూపానంద స్వామి.ఆధ్యాత్మిక మార్గం నాది అని చెప్పుకునే ఈ స్వామి కి ఇంత ఆసక్తి ఎందుకు కలిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.ఆ స్వామికి రాజగురువు ఆశ కల్పించింది వేరెవరో కాదు స్వయానా జగన్..అదెలాగంటే?
2014 ఎన్నికల ముందు ..ఫలితాలు వచ్చిన ఓ ఆరు నెలల దాకా జగన్ పార్టీలో ఇంకెవరి మాట వినని రోజులవి.మళ్లీ అవినీతి కేసులు ఉచ్చుగా బిగుసుకుంటాయని జగన్ కూడా లోలోన ఆదుర్దా పడుతున్న సమయమది.అప్పట్లో ఆయనతో పూజలు,వ్రతాలు,యాగాలు లాంటివి చేయిస్తే మేలని జగన్ సన్నిహితులు అనుకున్నారట.ఆ టైం లో స్వరూపానంద ఇచ్చిన సలహాల మేరకి జగన్ ఆ క్రతువులు పూర్తి చేశారు.క్రైస్తవ ముద్ర పోగొట్టుకునేందుకు కూడా ఈ వ్యవహారం ఆయనకి కొంత ఉపయోగపడింది.అంతకన్నా ముఖ్యంగా జగన్ అనుకున్నట్టు ఇంకోటి కూడా జరిగింది.కేంద్రంలో,రాష్ట్రంలో వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కేసుల అంశం పెద్దగా ఇబ్బంది కలిగించకపోవడంతో స్వరూపానంద మీద జగన్ కి గురి కుదిరిందట.ఇదే విషయాన్ని ఓ సందర్భంలో స్వామీజీ కి కూడా చెప్పడంతో ఆయన ఫుల్ ఖుషీ అయ్యారంట.
ఎవరి మాట వినని జగన్ తన మాట విన్నాడని వైసీపీ నేతలు కూడా చెప్పడంతో స్వరూపానంద కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిందట.అప్పటినుంచి వైసీపీ నేతలు అడిగినా అడగకపోయినా స్వామి సలహాలు ఇస్తున్నారట.లోపల ఏమనుకున్నా జగన్ సహా ఆ పార్టీ నేతలు స్వామీజీని బాగానే గౌరవిస్తున్నారు.ఇటీవల శారద పీఠంలో జరిగిన వార్షికోత్సవానికి జగన్ రాలేక బొత్స,ధర్మాన వంటి నేతల్ని పంపారు.వారిని చూసి సంతోషించిన స్వామి ఆధ్యాత్మిక విషయాల్ని కాసేపు పక్కనబెట్టి జగన్ పొగడ్తలతో రెచ్చిపోయారట.ఇదంతా చూస్తున్న వారికి జగన్ రాజగురువు పోస్ట్ కోసం స్వామి గట్టిగానే ట్రై చేస్తున్నారని అంటున్నారు.ఈయన ఇప్పుడు ట్రై చేస్తున్నారు గానీ ఒకప్పుడు కోదండరాం ఏకంగా కెసిఆర్ రధసారధినని భావించారు.పని అయిపోయాక ఆయన పరిస్థితి ఏమిటో చూస్తూనే వున్నాం.కాసింత జాగ్రత్తగా ఉండు స్వామీ…రాజకీయ నేతలతో నెయ్యం..పులి మీద స్వారీ ఒకటే.అవసరం వున్నప్పుడు కాదు ..అది తీరాక అసలు మనుషులు…అదే లోపలి మనుషులు బయటికివస్తారు.ఆ కఠోర వాస్తవాన్ని తట్టుకునే శక్తి ఉంటేనే అడుగు ముందుకు వేయాలి..
ఈ మొత్తం స్టోరీ లో ఓ కొసమెరుపు వుంది.స్వరూపానంద ఇలా జగన్ రాజగురువు పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాడని తెలిసి కూడా టీడీపీ ఎంపీ మురళీమోహన్ శారద పీఠానికి వచ్చిపోతుంటారు. కానీ స్వామి దృష్టి వైసీపీ మీదే ఉందని తెలిసిన విశాఖ దేశం నేతలు ఓ జోక్ వేస్తున్నారట.తెలంగాణ వచ్చాక బాబు రాజగురువు పోస్ట్ కూడా ఖాళీ అయ్యిందని చెప్తే స్వరూప మనసు మారొచ్చని సరదాగా అంటున్నారట.