కొంప‌ముంచిన శార‌ద‌?

0
411
saradha scam

Posted [relativedate]

saradha scamరాజకీయాల్లో సీజనల్ లీడర్లకు కష్టమే. ఈ రాజకీయ చదరంగంలో అన్నీ తట్టుకున్న వారే ఇక్కడ ఉండగలుగుతారు. ముఖ్యంగా అధికారపార్టీ మాయలు, కుట్రల నుంచి బయటపడాలంటే ఆ మాత్రం ధైర్యం, తట్టుకునే శక్తి ఉండాలి. అది లేకపోతే రాజకీయాలకే గుడ్ బై చెప్పే పరిస్థితి రాక తప్పదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి రాజీనామా అలాంటిదేనన్న ప్రచారం జరుగుతోంది. శార‌ద స్కాం ఆయ‌న కొంప ముంచింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

గత ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున మిథున్ రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. శారద చిట్‌ఫండ్‌ స్కాంలో ఆయన ప్రమేయముందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ కూడా ప్రశ్నించింది.

శారద స్కాంలో త‌న‌ పేరు రావడంపై మిథున్ చ‌క్ర‌వ‌ర్తి సీరియస్ గా స్పందించారట. శారద గ్రూప్‌తో అనుబంధమున్న వారిలో.. సంస్థ నుంచి తీసుకున్న డబ్బులు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చిన ఏకైక వ్యక్తి మిథున్‌. ఆయన గత ఏడాది జూన్‌ 16న స్వచ్ఛందంగా రూ. 1.19 కోట్ల చెక్కును తన లాయర్‌ ద్వారా ఈడీ కార్యాలయానికి పంపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు లీకులు వచ్చాయట. రాజకీయాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారట. అంతే… ఈ కేసులు.. లొల్లి మనకెందుకు? అనవరంగా పేరు చెడగొట్టుకోవడం తప్ప.. అన్న నిర్ణయానికి మిథున్ వచ్చేశారట. అందులో భాగంగానే అప్పట్నుంచి అప్పటినుంచి రాజ్యసభ సమావేశాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ మధ్య మరోసారి ఈడీ నుంచి పిలుపు వచ్చే పరిస్థితులు కనిపించడంతో మిథున్ ఇక లాభం లేదని గట్టిగా నిర్ణయించుకున్నారట.

శారద స్కాంలో ఆరోపణలు రావడంతో ఆయన వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కుంగిపోయారట. అందుకే ఎంపీ పదవిని త్యాగం చేశారని కోల్ కతాలో టాక్ నడుస్తోంది. అందుకే దానికి అనారోగ్యాన్ని సాకు చూపిస్తున్నారని సమాచారం. ఏదేమైనా ఢిల్లీ దెబ్బకు మరో వికెట్ పడిందని చెప్పుకుంటున్నారు ఇత‌ర పార్టీల నేత‌లు. తృణ‌మూల్ నేత‌లు అలాంటిదేమీ లేద‌ని చెబుతున్నా… నిప్పు లేనిదే పొగ రాదుగా!!

Leave a Reply