పబ్లిసిటీ స్టంట్స్‌.. పోలీసుల హైరాన

Posted April 19, 2017

sarath kumar daughter varalakshmi kidnap drama
హీరోయిన్‌ వరలక్ష్మి కిడ్నాప్‌ అయ్యింది అంటూ స్వయంగా ఆమె పీఆర్‌ కొంత మ్యాటర్‌ మరియు ఒక ఫొటోను మీడియాకు పంపాడు. దాంతో ఒక్కసారిగా తమిళ మీడియాతో పాటు తెలుగు, జాతీయ మీడియా కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. హీరోయిన్‌ కిడ్నాప్‌ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి హీరోయిన్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు అని తెలుసుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా అదో డ్రామా అని తెలిసి చిత్ర యూనిట్‌ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కిడ్నాప్‌ డ్రామా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరలక్ష్మి ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం అంటూ హీరోయిన్‌ కిడ్నాప్‌ అయ్యింది అంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే మీడియా ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకు వెళ్లడంతో అంతా డ్రామా అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు. ఈ పబ్లిసిటీ డ్రామ అంతా మొదటి నుండి కూడా వరలక్ష్మికి తెలుసు. అయితే తాజాగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి కిడ్నాప్‌ పబ్లిసిటీని ప్లాన్‌ చేసినట్లుగా నాకు చెప్పలేదు అని, షూటింగ్‌ సందర్బంగా తీసుకుని స్టిల్‌ను ఇలా వాడారు అంటూ మరో డ్రామ మొదలు పెట్టింది. మొత్తానికి వరలక్ష్మి సినిమా పబ్లిసిటీ కిడ్నాప్‌ డ్రామా టెన్షన్‌ను క్రియేట్‌ చేసి విమర్శల పాలు అయ్యింది. కాని సినిమాకు మాత్రం మంచి పబ్లిసిటీ దక్కింది. ఇలాంటి చీప్‌ పబ్లిసిటీ డ్రామాలు మరెన్ని ముందు ముందు చూడాలో..!

SHARE