షాపింగ్ కాంప్లెక్స్ గా.. సారథి స్టూడియోస్ ?

Posted October 14, 2016

  sarathi studios hyderabad built new complex

భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొంది హైదరాబాద్ సారథి స్టూడియోస్. ఇక్కడ వేలకొలది చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.  ఇకపై,
సారథి స్టూడియోస్ చరిత్రగానే మిగిలిపోనుంది. త్వరలోనే సారథి స్టూడియోస్ షాపింగ్ కాంప్లెక్స్ గా మారబోతుంది. కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలకి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లు కావాలంటూ తెలంగాణా రాష్ట్ర పర్యావరణ శాఖకి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అప్లికేషన్ కూడా దాఖలు కావడంతో ఈ విషయం బయటికొచ్చింది.

స్టూడియోని 3 ఇండోర్ షూటింగ్ ఫ్లోర్స్ మినహాయించి. స్టూడియో పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలంలో కమర్షియల్ మాల్ తో పాటు, మల్టీప్లెక్స్, హోటల్ కి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సినీ రంగానికి చెందిన జనాలు సారథి స్టూడియోస్ తో పెనవేసుకొన్న అనుబంధాన్ని నెమరువేసుకొంటున్నారు.

SHARE