వాయిదా పడ్డ సర్కార్ -3

 Posted March 22, 2017

sarkar-3-release-date-postponed

అవును.. మీరు విన్నది నిజమే.. వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సర్కార్-3 రిలీజ్ వాయిదాపడింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జాకీష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలను పోషించారు. సోషియో పొలిటిక‌ల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కబోయే ఈ సినిమాను వర్మ పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్-7న రిలీజ్ కావాల్సిఉంది. అయితే సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో  రిలీజ్ చేయ‌లేక‌పోతున్నామ‌ని చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌క‌టించింది.   విడుదలను మే 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా స్పష్టంచేసింది. దీంతో అమితాబ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.  వర్మ‌కు ఎంత‌గానో క‌లిసొచ్చిన స‌ర్కార్ సిరీస్‌ లోని  ఈ సినిమా వర్మకు కంబ్యాక్ మూవీ అవుతుంద‌నుకుంటే ఇలా బ్రేకులు పడుతున్నాయేంటి అని వర్మ అభిమానులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ప్రకంపనాలు సృష్టిస్తున్న బాహుబలి రిలీజ్ అయ్యి అప్పటికి కేవలం 15రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి  సర్కార్-3 ఎలా నెట్టుకొస్తుందని ఆవేదన చెందుతున్నారు.

SHARE