Posted [relativedate]
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స కోసం సింగపూర్ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రికి ఓ రోబో చేరింది.ఆమెకి ఫిజియోథెరపీ చేయించేందుకు ఈ రోబో ని సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి చెందిన రోబోని రప్పించారు.ఆ ఆస్పత్రి రోబోటిక్ ఫిజియోథెరపీ కి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.జయ కి ఇంకా కృత్రిమశ్వాస అందిస్తున్నట్టు అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డి స్వయంగా వెల్లడించారు.ఆమె సొంతంగా 90 % మాత్రమే శ్వాస తీసుకోగలుగుతున్నారు.ఫిజియోథెరపీ తర్వాత ఆమె పూర్తిస్థాయిలో కోలుకోగలరని ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు దాదాపు మూడునెలలుగా జయకి సపర్యలు చేసిన ఆమె నెచ్చెలి శశికళ అనారోగ్యం పాలయ్యారు.దీంతో ఆమె అపోలోలోనే ఇన్ పేషెంట్ గా చేరారు.అయితే ఆమెది చిన్న సమస్యేనని త్వరలో కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.ఏదేమైనా జయ డిశ్చార్జ్ గురించి ఇంకా స్పష్టత రాలేదు.